అప్పుల బాధకు తాళలేక రైతు ఆత్మహత్య

నవతెలంగాణ-రేగొండ
అప్పుల బాధ భరించలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రూపిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ముడ్తనపెల్లి రాజయ్య (56) కు చెందిన మిర్చి పంట, వరి ధాన్యం ఇటీవల కురిసిన భారీ వర్షానికి తడిసింది. దాంతో తెచ్చిన అప్పులు కట్టలేమనే మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి తన వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి అతని కుమారులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. వెంటనే కుటుంబ సభ్యులు రాజయ్యను పరకాలలోని ప్రయివేటు హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు.

Spread the love