సౌత్‌ ఈస్ట్రర్న్‌ రైల్వే ఏజీఎం బదిలీ

చెన్నై : ఒడిశాలో 288 మంది మరణించిన ఘోర రైలు ప్రమాదం జరిగిన రెండు వారాల తరు వాత గురువారం సౌత్‌ ఈస్ట్రర్న్‌ రైల్వే ఆడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌ (ఏజీఎం)ను అతుల్య సిన్హా బదిలీ చేశారు. సిన్హాను పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ బర్ధామాన్‌ జిల్లాలో ఉన్న చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ ప్రిన్సిపాల్‌ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ పదవికి బదిలీ చేశారు. ఇది పదవీ పరంగా ఉన్నతమైనప్ప టికీ డౌన్‌గ్రేడ్‌గానే భావిస్తారు. సిన్హా బదిలీకి కార ణం చెప్పకపోయినా, రాష్ట్రపతి ఆమోదంతోనే ఈ బదిలీ జరిగినట్లు రైల్వే బోర్డు తన ఉత్తర్వుల్లో పేర్కొ ంది. సౌత్‌ ఈస్ట్రర్న్‌ రైల్వే నూతన ఏజీఎంగా ఈస్ట్ర ర్న్‌ రైల్వే ప్రిన్సిపాల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఎకె దుబేను నియమించారు. ఈ నెల 2న ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఢకొీన్న ప్రమాదం జరిగిన తరువాత ఇదే పెద్ద బదిలీగా భావిస్తున్నారు.