గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం నిర్వహించనున్న గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 105 గిరిజన గ్రామ పంచాయతీలలో వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు తెలియజేయాలన్నా రు. శుక్రవారం టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండాలలో జరిగిన అభివృద్ధిపై గ్రామ సభలు నిర్వహించి చర్చించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు విద్య ఉపాధిపై కల్పించిన 10 శాతం రిజర్వేషన్‌, ప్రతి సంవత్సరం సేవాలాల్‌ జయంతిని, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్కల జాతరలను ఘనంగా నిర్వహించే విషయాలు తెలియపరచాలన్నారు. ఈ నెల 18న మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించి, ప్రతి మండలం నుంచి విద్యార్థులు, పాత్రికే యులు, ప్రజా ప్రతినిధులను వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాట్ల వద్దకు తీసుకురా వాలని అన్నారు. 20న తెలంగాణ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చేందుకుగాను అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. 21న దేవాల యా లు, మసీదులు, చర్చిలను అందంగా అలంకరించాలని, అన్ని దేవాలయాలలో పూజా కార్యక్రమాలు, మసీదులు చర్చిలలో ప్రార్థనలు నిర్వహింప చేయాలని అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో చివరిరోజైనా 22న వికారాబాద్‌ పట్టణంలో నిర్మిస్తున్న అమరవీరుల స్థూపాన్ని ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, నియోజకవర్గ స్పెషల్‌ ఆఫీసర్లు, మం డల సాయి స్పెషల్‌ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.