– ఇన్సూరెన్స్ కడితేనే క్రాప్ లోనేంటి?
– సమాచార హక్కు ద్వారా నివేదిక కోరిన సీపీఐ(ఎం)
నవతెలంగాణ-చర్ల
రైతే దేశానికి వెన్నెముకని చెప్పుకోవడానికి తప్ప ఏజెన్సీలో రైతు పట్ల కొద్దిగా కూడా జాలి, కరుణ లేకుండా కొంతమంది వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం నరేష్ నిప్పులు చెరిగారు. సోమవారం మండల పరిధిలోని అర్.కొత్తగూడం ఏపీజీవీబీ బ్యాంక్ ఆవరణలో ఆయన మాట్లాడారు. ఆరు కాలం కష్టపడి రూపాయి రూపాయి కూడ పెట్టి జీవనోపాధి కోసం వ్యవసాయం చేసే రైతన్నకు బ్యాంకులు రుణాలు ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి మధ్యవర్తుల మాటలు నమ్మి అర్ కొత్తగూడం ఏపీజీవీబీ బ్యాంకు మేనేజర్ రైతులకు ఇచ్చిన క్రాప్ లోనుల్లో ఇన్సూరెన్స్‌కు చెల్లించాలంటూ హుంకు ప్రదర్శించడం సరికాదని ఆయన హితోపలికారు. అమాయక ఆదివాసి రైతులే లక్ష్యంగా సదర్ బ్యాంక్ మేనేజర్ ఓ మధ్యవర్తి చాలా అక్రమాలకు పాల్గొన్నట్లు కుర్నపల్లి, బోధనెల్లి, చింతగుప్ప ఎర్రబోరు మొదలు గ్రామాలలో రైతులు నాతో వాపోయారని మేనేజర్ తన పద్ధతి మార్చుకొని సేవలందిస్తారని అనుకుంటుంటే తన వైఖరి మార్చుకోకుండా అక్రమ కల్ప రవాణా సైతం గిరిజనులతో చేపించి నేడు గిరిజన రైతులను అపాసు పాలు చేస్తున్నాడని ఆయన విరుచుకుపడ్డాడు.
ఇన్సూరెన్స్ కడితేనే క్రాప్ లోనేంటి…
ఇన్సూరెన్స్ కడితేనే గ్రాఫ్ లోన్ ఇస్తానంటూ ఏపీజీవీబీ బ్యాంకు మేనేజర్ రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అసలు క్రాఫ్ లోన్ తీసుకోవడానికి ఇన్సూరెన్స్‌కి సంబంధం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎండనక, వాననక, చలనకా రాత్రనకా, పగలనకా పాము, తేలులను సైతం లెక్కచేయకుండా ప్రాణానికి తెగించి పండించే పంటకు మద్దతు ధర లభించక నాన్న అవస్థలు పడుతున్న రైతులకు క్రాఫ్‌లోని ఇవ్వడానికి ఇన్సూరెన్స్ తిరఖాస్తు పెట్టడం ఏమిటని ఆయన ధ్వజమెత్తారు. రైతుల ఖాతా పుస్తకాలలో లావాదేవీలను ముద్రించి ఇవ్వడంలో బ్యాంకు మేనేజర్ ఎందుకు తాస్కారం చేస్తున్నారని ఇన్సూరెన్స్ కట్టించినంత చురుకుగా బ్యాంకు ఖాతాల్లో ముద్రించడంలో ఎందుకు చొరవ చూపటం లేదని ఆయన దుయ్యబట్టారు.
సమాచార హక్కు ద్వారా నివేదిక కోరిన సీపీఐ(ఎం)
సమాచార హక్కు ద్వారా ఏపీజీవీబీ బ్యాంకులో జరిగిన అవకతవకలపై సీపీఐ(ఎం) నివేదికను కోరింది. 2021 మార్చి ఒకటవ తారీఖు నుండి 2023 సెప్టంబర్ 11వ తారీకు వరకు ఆర్.కొత్తగూడెం ఏపీజీబీ బ్యాంకులో జరిగిన అవకతవకలపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని, ముద్రణాలోన్లు, క్రాప్ లోన్లు, ఇన్సూరెన్స్ వివరాలు క్షుణ్ణంగా మొత్తం ఇవ్వాలని మండల కార్యదర్శి కారం నరేష్, మండల కమిటీ సభ్యులు కుంజా వెంకటేశ్వర్లు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నూపా కృష్ణ, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.