కృష్ణకు ఘన నివాళి..

Tribute to Krishnaలెజెండరీ నటుడు, సూపర్‌స్టార్‌ కష్ణ విగ్రహాన్ని అగ్ర కథానాయకుడు కమల్‌ హాసన్‌ శుక్రవారం ఉదయం విజయవాడలో ఘనంగా ఆవిష్కరించారు. భారతీయ సినిమాలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ నటుడికి ఇది గొప్ప నివాళి. కష్ణ పట్ల తన అభిమానాన్ని ప్రతిబింబిస్తూ కమల్‌ హాసన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ వేడుకకు మరింత గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ మహత్తర వేడుకని చూసేందుకు సూపర్‌ స్టార్‌ అభిమానులు, శ్రేయోభిలాషుల పెద్ద ఎత్తున పాల్గొని కష్ణపై తమ ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ వరల్డ్‌కు కష్ణ చేసిన కషికి ఈ విగ్రహం కలకాలం నిలువెత్తు నిదర్శనంగా, తరతరాల మధ్య వారధిగా నిలుస్తుందని కమల్‌ హాసన్‌ అన్నారు.