బెంగాల్‌లో తృణమూల్‌ ఆగడాలు

– ‘పంచాయతీ’ నామినేషన్ల పర్వంలో హింస
– వామపక్ష కార్యకర్త హత్య
– నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న టీఎంసీ గూండాలు
– నిరసనగా రాష్ట్రవ్యాప్త ప్రదర్శనలు
కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పంచాయతీ ఎన్నికలలో నామినేషన్లు దాఖలు చేయకుండా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను అడ్డుకుంటు న్నారు. దాడులకు తెగబడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన గురువారం హింసా కాండ చెలరేగింది. ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లాలో ని చోప్రాలో వామపక్షాలు, కాంగ్రెస్‌ సం యుక్తంగా నిర్వహించిన ర్యాలీపై తృణమూల్‌ కాంగ్రెస్‌ దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వామపక్ష కార్యకర్త మన్సూర్‌ అలీ ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్‌, వామపక్షాల కు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాల య్యాయి. భంగోర్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌) మధ్య జరిగిన ఘర్షణలో ఐఎస్‌ఎఫ్‌ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు. చోప్రాలో కాంగ్రెస్‌, వామపక్ష కార్యకర్తలు నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి ర్యాలీగా వెళుతుండగా ప్రదర్శనపై హఠాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. లాల్‌ బజార్‌, దాస్‌పరా నుండి నామినేషన్లు వేసేందుకు వెళుతుంటే తృణమూల్‌ మద్దతుదారులు అడుగడుగునా అడ్డు తగిలారని సీపీఐ (ఎం) కార్యకర్త ఒకరు తెలిపారు. స్థానిక తృణమూల్‌ ఎమ్మెల్యే నివాసం సమీపంలో కాల్పులు జరిగాయని ఆయన చెప్పారు. ఐదుగురిపై కాల్పులు జరిగా యని, వారిలో ముగ్గురు తీవ్రంగా గాయ పడ్డారని వివరించారు. గాయపడిన వారిలో ఒకరు ఆ తర్వాత చనిపోయారని తెలిపారు. వాహనమేదీ అందుబాటులో లేకపోవడంతో ఆయనను మోసుకుంటూ ఆస్పత్రికి తరలించా మని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసుల ఉదాశీనతపై వామపక్ష కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డు కుంటామంటూ తృణమూల్‌ కార్యకర్తలు ఉదయం నుండే తమను బెదిరించారని కాల్పు ల ఘటనలో గాయపడిన సీపీఐ (ఎం) కార్య కర్త చెప్పారు. గతంలో కూడా వారు చాలా సార్లు ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారని తెలి పారు. కాగా కాల్పుల ఘటనలో ఇద్దరు వామ పక్ష కార్యకర్తలు మరణించారని, 20 మందికి పైగా గాయపడ్డారని అనధికారిక వార్తలు తెలిపాయి. ఉత్తర 24 పరగణాల జిల్లా బరాసత్‌, దక్షిణ 24 పరగణాల జిల్లా భన్‌గర్‌లో కూడా నామినేషన్లు దాఖలు చేయకుండా తృణమూల్‌ దుండగులు వామపక్ష కార్యకర్తలను అడ్డుకు న్నారు. కాగా చాలా చోట్ల నామినేషన్లు దాఖలు చేయకుండా ప్రతిపక్ష అభ్యర్థులను నిరోధించా రని వార్తలు వస్తున్నాయి. తృణమూల్‌ ఆగ డాలు పెచ్చరిల్లుతున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. నామినేషన్ల దాఖలుకు చివరి రెండు రోజులు పలుచోట్ల తృణమూల్‌ కార్యకర్తలు భయానక వాతావరణాన్ని సృష్టిం చారని, కర్రలతో స్వైరవిహారం చేస్తూ అడ్డంకు లు సృష్టించారని వార్తలు వచ్చాయి. కాగా చోప్రా ఘటనకు నిరసనగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం ఎదుట, రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలలో వామపక్షాలు ప్రదర్శ నలు నిర్వహించాయి. ప్రదర్శన అనంతరం ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం అందించారు. హింస పెచ్చరిల్లుతున్నా రాష్ట్ర ఎన్నికల కమి షన్‌ పట్టనట్లు వ్యవహరిస్తోందని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్‌ సలీం విమర్శిం చారు. ఎన్నికల కమిషన్‌లో ఎలాంటి చలనం కన్పించడం లేదని, బాధ్యతారాహిత్యంగా ప్రవ ర్తిస్తోందని ధ్వజమెత్తారు. తృణమూల్‌ గూండా లకు రాష్ట్ర పోలీసులు సహకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా చోప్రా ఘటనను రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు కలకత్తా హైకోర్టు దృష్టికి తీసికెళ్లారు. ప్రతిపక్ష అభ్యర్థులు కోర్టులో నామినేషన్లు అందజేస్తే వారికి సహకరిస్తామని హైకోర్టు న్యాయమూర్తి రాజశేఖర్‌ మహంతా హామీ ఇచ్చారు. ప్రతిపక్ష అభ్యర్థులకు భద్రత కల్పించాలని రాష్ట్ర పోలీసులను ఆయన ఆదేశించారు.