ట్రస్టు సేవలు అభినందనీయం

– నర్సాపురం జిల్లా పరిషత్‌ పాఠశాల వార్షికోత్సవ సభలో వక్తలు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఏజెన్సీ ప్రాంత పేద, గిరిజన విద్యార్థులకు కార్పొరేట్‌ తరహా విద్యను అందించాలనే లక్ష్యంతో సూది రెడ్డి నాగిరెడ్డి-ఆదిలక్ష్మమ్మ మెమోరియల్‌ పేరుతో లక్షల రూపాయలు వెచ్చించి అధునాతనంగా భవన నిర్మాణాలు చేపట్టి ఈ ప్రాంతంలో వారి కుమారులు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీటీసీ తెలంగాణ సీతమ్మ, పలువురు వక్తలు కొనియాడారు. శనివారం పాఠశాల వార్షికోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు బోల్ల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక నరసాపురం సర్పంచ్‌ వి.శివరామకృష్ణ, ఎస్‌ఎంసి చైర్మెన్‌ విద్యాసాగర్‌ రావు, ఉప సర్పంచ్‌ రావులపల్లి రవికుమార్‌, ఎంఈఓ సమ్మయ్య హెచ్‌ఎం కెవి కాంతారావు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాల వార్షిక నివేదికలో పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పాఠశాల అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన సుదిరెడ్డి నాగిరెడ్డి ఆదిలక్ష్మమ్మ మెమోరియల్‌ ట్రస్ట్‌, నర్సాపురం వారి సేవలను పలువురు అతిథులు కొనియాడారు. అలాగే మెమోరియల్‌ ట్రస్ట్‌, నర్సాపురం వారి తరపున సూది రెడ్డి నాగిరెడ్డి సోదరులైన వేంకట రమణా రెడ్డిని సన్మాన పత్రంతో సన్మానించారు. ఈ సందర్బంగా నిర్వహించిన క్రీడలు, వ్యసరచన, వకృత్వం, చిత్రలేఖనం వంటి అంశాలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు వెంకట రమణా రెడ్డి అందజేశారు. విద్యార్ధినీ విద్యార్ధులు వివిధ సాస్కృతిక కార్య క్రమాలతో ఆహుతులను అలరించారు. అలాగే రావులపల్లి రావి కుమార్‌ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పదవ తరగతి పరీక్షలలో పాఠశాలలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో వున్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.