వాషింగ్టన్: ఎలన్ మస్క్ విధానాలకు ట్విట్టర్ విలువ భారీగా పతనమవుతోంది. గతేడాది 44 బిలియన్ డాలర్లకు ఆయన ట్విట్టర్‌ను కొనుగోలు చేయగా.. ఇప్పుడు ఆ విలువ మూడో వంతుకు పడిపోయిందని ప్రముఖ ఆర్థిక సంస్థ ఫిడెలిటీ తెలిపింది. ట్విట్టర్‌లో ఫిడెలిటీకి వాటాలున్నాయి. ట్విటర్‌ను తాను కొనుగోలు చేసిన విలువలో వాస్తవానికి సగం కూడా ఉండదని స్వయంగా పలుమార్లు ఎలన్‌మస్క్ పేర్కొన్న విషయం తెలిసిందే. అదే విషయాన్ని తాజాగా ఫిడెలిటీ స్పష్టం చేసి నట్లయ్యింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత దాని ఆర్థిక పరపతి మరింత పడిపోయింది. కాగా.. ట్విట్టర్ విలువను ఫిడెలిటీ ఎలా లెక్కగట్టిందనే విషయాన్ని వెల్లడించలేదు.