బాలుడిని కరిచిన రెండు పాములు

– ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
నవతెలంగాణ-నవీపేట్‌
వర్షాలు.. వరదలకు గ్రామాలకు చేరిన పాములు మనుషుల ప్రాణం తీస్తున్నాయి. తల్లిదండ్రుల పక్కన పడుకున్న బాలున్ని అర్ధరాత్రి ఒకేసారి రెండు పాములు కాటేశాయి. దాంతో బాలుడు మృతిచెందాడు.. ఈ విషాద ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలంలోని బినోల గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. భూమేష్‌ భార్య హర్షిత, ఇద్దరు పిల్లలతో కలిసి శుక్రవారం రాత్రి నిద్రపోయారు. అర్ధరాత్రి పెంకుటిల్లు పైనుంచి రెండు పాములు ఇంట్లోకి వచ్చాయి. తల్లిదండ్రుల పక్కలో పడుకున్న రెండేండ్ల బాలుడు మంగలి రుద్రాన్ష్‌ను కాటువేశాయి. బాలుడు ఒక్కసారిగా గట్టిగా ఏడవడంతో తల్లి లేచింది. పాములను పట్టుకొని విసిరేసింది. వెంటనే బాలున్ని నిజామాబాద్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించినా.. పరిస్థితి విషమించి శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు.