నాకు తెలియకుండానే పంట పొలంలో మట్టి తోలకాలు

– న్యాయం చేయాలంటూ వేడుకుంటున్న బాధిత రైతు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
సీతమ్మ సాగర్‌ బహుళార్దక సాధక ప్రాజెక్టు కరకట్టల నిర్మాణ పనుల కోసం పనులు దక్కించుకున్న ఎల్‌ఎన్‌టి సంస్థకు చెందిన గుత్తేదారు తనకు తెలియకుండానే తన పంట పొలంలో మట్టి తోలకాలు సాగించారని ఆరోపిస్తూ చిన్నబండిరేవు గ్రామానికి చెందిన పిట్టా పూర్ణచంద్రరావు అనే భాదిత రైతు ఆదివారం విలేకరులకు తెలిపాడు. పెద్దనల్లబల్లి రెవిన్యూ విలేజ్‌ పరిధిలోని పెద్దనల్లబల్లి గ్రామంలో గల 62/అ సర్వే నెంబర్‌లో 3 ఎకరాల పంట సాగు భూమి ఉందన్నారు. అట్టి పట్టా పొలంలో తనకు తెలియకుండా సుమారు అర ఎకరం భూమిలో 10 అడుగులు ఎత్తు, 12 అడుగుల వెడల్పు, 300 మీటర్లు వెడల్పు విస్తీర్ణంలో నా పంట పొలం నుండి సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టు కరకట్టల నిర్మాణం కోసం మట్టి తోలకాలు సాగించినట్లు స్థానిక రైతుల ద్వారా తనకు తెలిసిందన్నారు. దీంతో పాటు పంట పొలంలో ఉన్న సుమారు 20 తాటి చెట్లను సైతం తొలగించారని భాదిత ఆరోపించాడు. తనకు తెలియకుండి తన పట్టా పొలంలో మట్టి తోలకాలు సాగించిన ఎల్‌ఎన్‌టి సంస్థ నుండి తనకు తగు పరిహారం అందించే విదంగా ప్రభుత్వం అధికారులు న్యాయం చేయాలంటూ భాదిత రైతు వేడుకుంటున్నాడు.