అండర్ 17 బాలుర కబడ్డీ పోటీలు

నవతెలంగాణ – రాజంపేట్
మండలంలోని ఆర్గొండ  గ్రామంలో బుధవారం  సంక్రాంతి పండుగను పురస్కరించుకుని  హిందూ సేన ఆధ్వర్యంలో  అండర్ 17 బాలుర కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో ఆరు జట్లు పాల్గొనగా, పోటీలలో బాలురు హోరాహోరిగా తలపడ్డారు. విజేతలకు మెడల్స్ సురేష్, సతీష్ అందజేశారు.