#सागर– युवक को निर्वस्त्र कर बेरहमी से पीटने का वीडियो सोसल मीडिया में वायरल,सागर का बताया जा रहा है वीडियो,पीड़ित और आरोपी युवको की पहचान नही हुई,
पुलिस के पास अभी तक कोई शिकायत भी नही पहुंची है…!!
मोतीनगर थाने मे अज्ञातों के खिलाफ FIR की कवायद..@SPSagarmp #sagar #viralvideo pic.twitter.com/qDGpExeqbx— Journalist Parasram (@SahuParsram1) July 9, 2023
నవతెలంగాణ-భోపాల్: మధ్యప్రదేశ్‌లో వరుస అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆదివాసీ వ్యక్తిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయగా, నిన్న మరో ఆదివాసీ యువకుడిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి కదిలే కారులో చెప్పులతో చితకబాదారు. తాజాగా దొంగతనం ఆరోపణలతో మరో వ్యక్తిని నగ్నంగా కూర్చోబెట్టి దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు యువకులు ఓ యువకుడు దొంగతనం చేశాడని ఆరోపిస్తూ.. అతని దుస్తులు విప్పించి, ఓ గదిలో బంధించి, ప్లాస్టిక్ పైపులతో దాడి చేస్తున్న దృశ్యాలను కొందరు సోషల్ మీడియా గ్రూప్‌లలో షేర్ చేశారు. ఈ వీడియోలోని దృశ్యాల ఆధారంగా సాగర్‌లోని మోతీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ధరమ్ కాంతా ప్రాంతంలో ఘటన జరిగినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధిత యువకుణ్ని, అతడిపై దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అభిషేక్ తివారీ తెలిపారు.