దుర్గం చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నవతెలంగాణ-మియాపూర్‌
దుర్గం చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బుధవారం చోటు చేసుకుంది. సీఐ సురేష్‌ తెలి పిన వివరణ ప్రకారం దుర్గం చెరువు సమీపంలో గుర్తు తెలియని మృతదేహం నీటిలో తేలి కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని విలికి తీశారు. నలుపు రంగు ప్యాంట్‌ మాత్రమే దరించి ఉన్నాడు. ఇతని ఎడమ చేయిపైనా స్టార్‌ గుర్తు టాటో కాలేదు. ఎవరైనా సమాచారం కోసం 94906 17182 , 8712663119లను సంప్రదించాలని కోరారు. ఆయన కోరారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.