అకాల వర్షం…అపార నష్టం

  – మూడు గంటలు పాటు విద్యుత్ అంతరాయం…

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆదివారం సాయంత్రం సంభవించిన అకాల వర్షం, భారీ గాలులకు మండల వ్యాప్తంగా ఓ మోస్తరు గృహాలు, విద్యుత్ స్థంబాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో మూడు గంటలు పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వర్షం కొద్ది సమయం మే కురిసినా భారీగా గాలులు వీచాయి. మల్లాయిగూడెం లో అయిదారు గృహాలు పడిపోయినట్లు బాధితులు తెలిపారు. మండల కేంద్రం అయిన అశ్వారావుపేట లోని కాలింగులు బజార్ లో రెండు విద్యుత్ స్థంబాలు,జంగారెడ్డి గూడెం రోడ్ లో పేపరు బోర్డు సమీపంలో ఒక విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ నేలకొరిగాయి అని నష్టం సుమారు రూ.లక్ష ఉంటుందని ఎన్.పి.డి.సి.ఎల్ సబ్ ఇంజనీర్ శివప్రసాద్ తెలిపారు. విద్యుత్ పునరుద్దరణకు కనీసం 3 – 4 గంటలు సమయం పడుతుంది అని తెలిపారు.