జీటీఏ పేరును వాడుకోవడం చట్టబద్ధం కాదు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం (జీటీఏ) పేరును వాడుకుంటూ ఇచ్చిన ప్రకటన న్యాయబద్ధంగా, చట్టబద్ధం కాదని జీటీఏ అధ్యక్షులు కాసం ప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, గౌరవాధ్యక్షులు విశ్వనాథం గుప్తా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జీటీఏకు సంబంధం లేని ఐదారుగురు కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యవర్గ ఎన్నిక జరిగిందంటూ ప్రకటన ఇవ్వడం సరైంది కాదని పేర్కొన్నారు.