ఆర్భాటం ఘనం, ఆచరణ శూన్యం, ఉపయోగంలోకి రానీ వైకుంఠధామాలు 

– సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్యాల గోవర్ధన్
నవతెలంగాణ -కంటేశ్వర్
ఆర్భాటం గణం ఆచరణ శూన్యం ఉపయోగం లోకి రాని వైకుంఠధామాలు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్యాల గోవర్ధన్ మండిపడ్డారు. ఈ మేరకు గురువారం నిన్న నిజామాబాద్ నగరంలో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఆర్భాటంగా ప్రారంభోత్సవం చేసిన వైకుంఠధామాలను సిపిఎం ఆధ్వర్యంలో దుబ్బా ప్రాంతంలో సందర్శించడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వైకుంఠధామాలు ఘనంగా ప్రారంభమైన, ఇంకా ఉపయోగం లోకి రాలేదు, అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్యాల గోవర్ధన్ అన్నారు. నిన్న దుబ్బా ప్రాంతంలో వైకుంఠధామం ప్రారంభమైనప్పటికీ నేడు రోడ్లపైనే శవాన్ని కాల్చుకునే దుస్థితి ఉందన్నారు. అసంపూర్తి పనులతో, హడావిడి ప్రారంభోత్సవాలు ఎందుకో అధికార పార్టీ నేతలు ప్రజలకు సంజాయిషి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి వైకుంఠధామాలను అందుబాటులోకి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు ద్యారాంగుల కృష్ణ, నాయకులు అనిల్ కుమార్, నాగిరెడ్డి, దేవిదాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.