కళాశాల విద్యాశాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ

– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సాంకేతిక, కళాశాల విద్యాశాఖ విద్యాశాఖ కమిషనర్‌గా ఉన్న నవీన్‌మిట్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. నూతన కమిషనర్‌గా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.