వనితాగ్రణి అన్విత

Vanitagrani Anvita11వ శతాబ్దంలోనే ఓరుగల్లు సామ్రాజ్యాన్ని పరిపాలించి ఎన్నో యుద్ధాలలో విజయాన్ని పొంది ఖ్యాతి గడించిన ప్రాంతమది. మహిళలు అబలలు కాదు సబలలని చాటి చెప్పిన రుద్రమదేవి ఏలిన గడ్డ అది. అలాంటి నేలపై పుట్టి పర్వతారోహణలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ తేజం పడమటి అన్విత గురించి మానవిలో తెలుసుకుందాం…
అన్విత 1997లో ఎర్రంపల్లి గ్రామం, భువనగిరి మండల్‌, యాదాద్రి జిల్లాలో పుట్టారు. తల్లి చంద్రకళ అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి మధుసూదన్‌ రెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారిది మామూలు మధ్యతరగతి కుటుంబం. అన్వితకు ఒక అక్కయ్య కూడా ఉంది. ఆమె ఒకటి నుంచి నాలుగవ తరగతి వరకు ఎర్రంపల్లి నుండి భువనగిరికి అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తూ చదువుకున్నారు. పిల్లల చదువుకు కష్టంగా ఉందని భువననగిరికి వాళ్ళ కుటుంబం షిఫ్ట్‌ అయింది. 5 నుంచి 10వ తరగతి వరకు భువనగిరి హైస్కూల్లోనే చదువుకున్నారు.
అడ్వెంచర్‌ ఫీల్డ్‌లో
ఇంటర్‌ భువనగిరిలోని ప్రతిభ కాలేజ్‌లో పూర్తి చేశారు. పర్వతారోహణ చేయాలనే తపన తను ఇంటర్‌లోనే ఆవిర్భవించింది. ఒకరోజు న్యూస్‌ పేపర్‌లో రాక్‌ క్లైమింగ్‌ స్కూల్లో పర్వతారోహణ శిక్షణను నేర్పిస్తున్నారనే విషయం చదివారు. అది చూసిందే తడవుగా తండ్రిని అడిగి ఒప్పించి ఐదు రోజులు ఆ కోర్సులో చేరారు. అడ్వెంచర్‌ ఫీల్డ్‌లో ఉన్న వారికి ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన టెంజింగ్‌ నార్గే అవార్డు గ్రహీత అయినా కోచ్‌ శేఖర్‌ బాబు బజినేపల్లి దగ్గర శిక్షణ తీసుకున్నారు. మన దేశంలో నార్త్‌ సైడ్‌లో రాక్‌ క్లైమింగ్‌ అకాడమీ ఇనిస్టిట్యూటల్లో ఏడు ఆర్మీలోని కల్నల్స్‌ అండర్‌లో నడుస్తున్నాయి. ఏడాదికి 150 మందికి మాత్రమే స్కాలర్షిప్‌లు ఇచ్చి ట్రైనింగ్‌ ఇచ్చేటువంటి గొప్ప ఇనిస్టిట్యూట్లు అవి. అలాంటి ఒక గొప్ప ఇనిస్టిట్యూట్లో అతి తక్కువ ఫీజు కట్టి 17 ఏండ్ల వయసులో వెస్ట్‌ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఉన్న హిమాలయన్‌ మౌంట్‌ మేరింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో బేసిక్‌ కోర్స్‌ కోసం చేరారు.
75మందితో ప్రారంభమైన ప్రయాణం
75 మందితో మేనెలలో ప్రారంభమైన వీరి ప్రయాణం 28 రోజులు కొనసాగింది. మౌంటెన్స్‌ ఎక్కుతూ మధ్య మధ్యలో టెంట్‌ వేసుకొని ఉంటూ టెక్నికల్‌ ట్రైనింగ్‌, వెదర్‌ ట్రైనింగ్‌ తీసుకుంటూ… కోచ్‌ ఇచ్చే గ్రేడ్‌లు వీరికెంతో ఉత్సాహాన్ని ఇచ్చేవి. వారి నిత్యావసర వస్తువుల 20 కేజీల బరువును మోస్తూ 4500 మీటర్ల వరకు పైపైకి ఎక్కిన వారిలో చివరికి 35మంది మాత్రమే మిగిలారు. అందులో అన్విత ఒకరు. భువనగిరిలోని నవభారత డిగ్రీ కాలేజ్‌ ఆమె డిగ్రీని పూర్తి చేశారు. ఈ సమయంలో సెకండ్‌ లెవెల్‌ రాక్‌ లర్నింగ్‌ స్కూల్‌కి రోజూ వెళ్లడం వీలు కాలేదు. ఆ సమయంలోనే భువనగిరిలోనే ఉన్నటువంటి రాక్‌ లర్నింగ్‌ స్కూల్‌ని ట్రైనింగ్‌ అకాడమీ ఆఫ్‌ లెర్నింగ్‌ స్కూల్‌గా మార్చారు. అక్కడే ఆమె ప్రతి శని,ఆది వారాల్లో ట్రైనింగ్‌కి వెళ్లేవారు.
డిగ్రీ తర్వాత…
2019లో ఆంధ్ర మహిళాసభలో ఎంబీఏ జాయిన్‌ అయ్యారు. అక్కడే అన్విత తన అభిరుచి గురించి ఓయూ జాయిన్‌ డైరెక్టర్‌ జయలక్ష్మికి చెప్పారు. ఆమె సహకారంతోనే అన్విత సెకండ్‌ లెవెల్‌ వెళ్లారు. అదే సమయంలో అడ్వాన్స్‌ మౌంట్‌ మేరింగ్‌ ట్రైనింగ్‌ డార్జిలింగ్‌లో చేశారు. ఇక 2021 జనవరిలో తన సాహసయాత్ర ప్రారంభించారు. ముందుగా ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతమైన కిలిమంజారో అధిరోహించి తన కల నెరవేర్చుకున్నారు. ఇక 2021 ఫిబ్రవరిన లడక్‌లో ఉన్న ఖష్ట్రaసవy పర్వతాన్ని -30 డిగ్రీల టెంపరేచర్‌ ఉన్నప్పుడు అధిరోహించారు. అప్పుడు కూడా పది మంది కలిసి యాత్ర ప్రారంభిస్తే చివరికి ఐదుగురు మాత్రమే ఎక్కగలిగారు. అందులో మన అన్విత ఒకరు. అలా శీతాకాలంలో పర్వతారోహణ చేసిన ఫస్ట్‌ ఇండియన్‌ టీంగా రికార్డు సష్టించారు.

గొప్ప ఆశయంతో
2022 డిసెంబర్‌ 26న అంటార్కిటికా ఖండంలో ఉన్న మౌంట్‌ విన్సన్‌ పర్వతాన్ని అధిరోహించి రికార్డు సష్టించారు. అతి చిన్న వయసులోనే ఇన్ని శిఖరాలను అధిరోహించిన అన్విత ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించినందుకు తెలంగాణ గవర్నర్‌ బెస్ట్‌ అచీవ్మెంట్‌ అవార్డు ఇచ్చి సత్కరించారు. 2023లో ఉమెన్స్‌ డే సందర్భంగా ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ సంస్థ వారు లక్ష రూపాయల నగదుతో సత్కరించారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నెన్నో అవార్డులు అందుకున్నారు. తాను సాధించిన ఘనత ఇతర విద్యార్థులు సాధించాలనే గొప్ప ఆశయంతో ముందడుగు వేస్తున్నారు. 2022-2023 మధ్యలో 2500 విద్యార్థులకు ట్రైనింగ్‌ ఇచ్చి వారిలో సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ పెంచారు. ఇప్పటివరకు నాలుగు ఖండాలలోని ఎనిమిది పర్వతాలను అధిరోహించిన ఘనత అన్వితది. మిగిలిన మూడు ఖండాలలోని ఎత్తైన పర్వతాలను అధిరోహించి చరిత్ర సష్టించాలనే తపన ఆమెది.
చరిత్ర సష్టించిన ఘనురాలు
2021 డిసెంబర్‌లో యూరప్‌ కాంటినెంట్‌లోని అతి పెద్ద మౌంట్‌ ఎబ్రెస్‌ పర్వతాన్ని -52 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న శీతాకాల సమయంలో అధిరోహించి 10మీ భారత జెండాను అక్కడ పాతి తన సత్తా చాటుకున్న మొట్టమొదటి భారతీయ వనిత అన్విత. అందుకుగాను ఆమెకు రష్యన్‌ గవర్నమెంట్‌ అప్రియేషన్‌ ఈవెంట్‌ చేసి ప్రోత్సహించారు. ఇక 2022 మే 16న ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఎక్కి తన మూడవ అంతర్జాతీయ శిఖరారోహణ రికార్డు సష్టించారు. 2022 సెప్టెంబర్‌ 28న ప్రపంచంలోనే 8వ అత్యంత ఎత్తైన మౌంట్‌ మానెసులి శిఖరాన్ని -48 డిగ్రీల వాతావరణం ఉన్నప్పుడు మరొక భారతీయ పర్వతారోహకులు బల్జిత్‌ కౌర్‌తో కలిసి ఎక్కారు. అప్పటివరకు 8163 మీటర్లుగా పర్వతం ఎత్తును లెక్కించింది నేపాల్‌ గవర్నమెంట్‌. ఆ లెక్కను సైతం దాటి చరిత్ర సష్టించిన ఘనురాలు అన్విత.
– వకుళ వాసు, 9989198334