వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి

– బోయినపల్లి వినోద్‌కుమార్‌కు టీఆక్టా వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1,335 మంది కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీస్‌ కాంట్రాక్టు టీచర్ల సంఘం (టీఆక్టా) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ను మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో ఆ సంఘం అధ్యక్షులు డాక్టర్‌ ఎం రామేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శ్రీధర్‌ కుమార్‌ లోధ్‌ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.