అతి అనర్థం

Very pointlessస్మార్ట్‌ఫోన్ల వినియోగంతో మహిళల ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలేంటో తెలిస్తే మీరిక వాటికి దూరంగా ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా 74 శాతం మంది మహిళలు స్మార్ట్‌ ఫోన్‌ వినియోగంతో ఒత్తిడికి లోనై, నిద్రలేమికి గురవుతున్నారని అమెరికాలోని ‘స్పెయిన్‌ ల్యాబ్స్‌’ చేసిన అధ్యయనాలు చెబుతున్నాయి. సామాజిక మాధ్యమాలు, గేమ్స్‌ వల్ల మగవారితో పోలిస్తే మహిళలు 29 శాతం అధికంగా ఎక్కువ ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఫొటోలు, రీల్స్‌ అంటూ వ్యక్తిగత గోప్యతను నెట్టింట్లో ఉంచి  సమస్యలెందుర్కొంటున్నారు. వాటి నుంచి బయటపడలేక ఆత్మహత్యాహత్నానికి పాల్పడుతున్నారు. ఫోన్‌ని పొత్తి కడుపు, ఛాతీ మీద పెట్టుకొని నిద్రపోవడం వల్ల దాని ప్రభావం పునరుత్పత్తి వ్యవస్థపై పడి, అండాశయ నిల్వలు తగ్గుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. నెలసరి క్రమం తప్పి పీసీఓఎస్‌, పీసీఓడీ సమస్యలతో సతమతమవుతున్నారు. నిద్రలేమి, నడుము, వెన్ను, మెడ నొప్పులకు గురవుతున్నారు. ు