అతి అనర్ధమే…

Very rude...వ్యాయామం ఎవరికైనా చాలా మంచిది. అయితే.. అతి ఎప్పుడూ అనర్థమే.. ఎక్కవ సమయం ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల ఎన్నో అనర్థాలున్నాయి. నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. ఆ విషయంలో మరో ప్రశ్నకు తావులేదు. అయితే ఏదైనా మితంగా ఉండాలే తప్ప… అతిగా వెళ్తే అనర్థాలు తప్పవు. అందుకే ఎక్కువ సమయం ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల ఎన్నో అనర్థాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ అనర్థాలు ఏంటో ఇక్కడ చూద్దాం…

 రుతుక్రమంపై అతి వ్యాయామం తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముంది. గంటల తరబడి వ్యాయామం చేస్తూ గడపడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే ప్రమాదముంది. వారంలో ప్రతి రోజూ కఠిన వ్యాయామం చేయటానికి బదులు కొన్నిసార్లు తక్కువ వ్యాయామాలు చేయాలని డాక్టర్ల సూచిస్తున్నారు.
గంటల తరబడి వర్కౌట్స్‌ చేస్తే మహిళ్లలో నెలసరి వచ్చే ముందు ప్రొజెస్టెరాన్‌ స్థాయి పెరిగే అవకాశం ఉంది.
ప్రొజెస్టెరాన్‌ స్థాయి పెరగడం ద్వారా శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. దీని వల్ల మహిళలు అసహనానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ అవుతాయి. మహిళలు రోజుకు 90 నిమిషాలకు మించి వర్కౌట్స్‌ చేస్తే మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత పోషకాహరం, సరైన నిద్ర అవసరం. వీటిని త్యాగం చేసి వ్యాయామం కోసం వెచ్చిస్తే దాంతో శరీరానికి అనర్థాలే ఎక్కువగా కలుగుతాయి.
అందుకే వారంలో 5, 6 రోజులు వ్యాయామం చేసి మిగతా సమయంలో చిన్న యోగాసనాలు వేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.