ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1957 ఎన్నికల్లో చిలుపూర్ మండలంలోని చిన్న పెండ్యాల గ్రామానికి చెందిన పెండ్యాల రాఘవరావు మూడు చోట్ల విజయం సాధించారు. పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా వరంగల్ లోక్సభ, హన్మకొండ, వర్ధన్నపేట శాసనసభ స్థానాలకు పోటీ చేశారు. ఆయనకు మూడు స్థానాల్లోనూ ప్రజలు పట్టం కట్టారు. హన్మకొండ, వర్ధన్నపేట శాసనసభ స్థానాలకు రాజీనామా చేసి వరంగల్ లోకసభ సభ్యుడిగా ఐదేండ్లపాటు పని చేశారు.