పుట్టను విజయం వరించాలి

పుట్టను విజయం వరించాలి– వనదేవతలకు మొక్కులు చెల్లించిన శైలజ
నవతెలంగాణ-మల్హర్‌రావు
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధూకర్‌ను విజయం వరించాలని మధుకర్‌ సతీమణి, మంథని మున్సిపల్‌ చైర్మన్‌ పుట్ట శైలజా గురువారం గుండారం సమ్మక్క,సారాలమ్మ వన దేవతలకు మొక్కులు చెల్లించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్‌ విజయం సాధించడంతో పాటు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎంగా కేసీఆర్‌ కావాలని ఆకాంక్షించారు. మధన్న గెలుపుకోసం గ్రామస్తుల కోరిక మేరకు ఆమె ఎత్తు బంగారంతో పాటు అమ్మవారికి చీరలు, ఓడి బియ్యం సమర్పించారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, పుట్ట మదూకర్‌ ఎమ్మెల్యేగా గెలిచి మంథనికి వెలుగులు ప్రసాదించాలన్నారు.