పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన విద్యాలత

నవతెలంగాణ-ఇల్లందు
మండల పరిధిలోని సుభాష్‌ నగర్‌ హై స్కూల్‌ నందుగల అసెంబ్లీ పోలింగ్‌ కేంద్రాలను జిల్లా ముఖ్య కార్యనిర్వహణ అధికారి విద్యాలత గురువారం పరిశీలించారు. ఈ పోలింగ్‌ కేంద్రాలలో విద్యుత్‌, మంచినీటి సౌకర్యం, ర్యాంపులు, టాయిలెట్స్‌, పోలింగ్‌ నిర్వహణకు కావలసిన అన్ని వసతులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలరాజు, హై స్కూల్‌ హెచ్‌ఎం ఉమా శంకర్‌, ప్రైమరీ స్కూల్‌ హెచ్‌ఎం దేవదత్తం, పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్‌, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.