– ఆదుకుంటామని భరోసా
– సీఎంఆర్‌ఎఫ్ చెక్‌ల పంపిణీ
నవతెలంగాణ-కారేపల్లి
మండలంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ఆదివారం పర్యటించారు. ఆయనకు బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కారేపల్లి బీఆర్‌ఎస్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్‌లను అందజేశారు. మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, మృతి చెందిన కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. కారేపల్లి క్రాస్ రోడ్‌లో అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న ఆంధ్రప్రభ విలేకరి అనంతారపు వెంకటాచారి, కారేపల్లిలో సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు కొనకండ్ల సత్యనారాయణ, విశ్రాంత ఉపాధ్యాయుడు చెవుల వెంకటేశ్వర్లు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్ధితిని అడిగితెలుసుకున్నారు. బీఆర్‌ఎస్ నాయకులు మేకల యాదగిరి తండ్రి వెంకటయ్య ఇటివల మృతి చెందటం ఆయన ఇంటికి వెళ్ళి మేకల వెంకటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు ఆర్పించారు. భాగ్యనగర్‌తండాలో మాజీ ఉపసర్పంచ్ అనారోగ్యంతో మృతి చెందగా ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళ్లుఆర్పించి ఆర్ధిక సాయం చేశారు. సామ్యాతండాలో అంతర్గత రహదారుల సమవ్యను మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎస్‌కె.గౌస్‌పాషా ఎమ్మెల్యే దృష్టికి తీసుకరాగా సీసీ రోడ్డుకు హామీ ఇచ్చారు. లావుడ్యాతండాలో మృతి చెందిన లావుడ్యా మంగిలాల్ కుటుంబాన్ని సందర్శించి సానుభూతిని తెలిపారు. ఆర్ధిక సాయం చేశారు. తులిశ్యాతండాలో వడదెబ్బతో మృతిచెందిన ఉపాధి కూలీ వాంకుడోత్ సునిత కుటుంబాన్ని పరామర్శించి భర్త లక్క, కుమారుడు, కుమార్తెలను ఓదార్చారు. ఆర్ధిక సాయం చేశారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. వైరా ఎమ్మెల్యే వెంట మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ మాలోత్ శకుంతల, మండల ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బన్సీలాల్, అజ్మీర వీరన్న, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ వైస్ చైర్మన్ ధారవత్ మంగిలాల్, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు ధారవత్ పాండ్యా నాయక్, ఎంపీటీసీలు మూడ్ జ్యోతి, భాగం రూప నాగేశ్వరరావు, సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు భూక్య రంగారావు, సర్పంచ్ లు మాలోత్ కిషోర్, బాణోత్ కుమార్, ఇస్లావత్ సుజాత, అజ్మీర అరుణ, బాణోత్ సక మారు, బాణోత్ సంధ్యా రాందాస్, జర్పుల శాంతి హచ్చు, మొగిలి ఆదినారాయణ, కారేపల్లి సంత చైర్మన్ అడ్డగోడ ఐలయ్య, సొసైటీ, ఏఎంసీ డైరెక్టర్లు తోటకూరి రాంబాబు, డేగల ఉపేందర్, వాంకుడోత్ నరేష్, తోటకూరి పిచ్చయ్య, పర్సా పట్టాభిరామరావు, అజ్మీర వీరన్న, అడపా పుల్లారావు పాల్గొన్నారు.