– ఎంఐఎం కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్‌బి గుల్షన్
నవతెలంగాణ-కొడంగల్
కొడంగల్ పట్టణ కేంద్రంలోని వినాయక చౌర స్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టపానకు అను కూలమైన స్థలం కాదని, ఎంఐఎం కొడంగల్ నియో జకవర్గ అధ్యక్షులు ఎస్‌బి గుల్షన్ అన్నారు. కొడంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌కు ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరుకుగా ఉ న్న వినాయక కూడళ్లల్లో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతి ష్టాపన సరికాదని, వినాయక కూడలిలో రోడ్డు ఇరు కుగా రులు ప్రతినిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటు న్నా రన్నారు. ఇరుకైన రోడ్డులో విగ్రహ ప్రతిష్టాపన చేయ డంవల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవు తాయని, విగ్రహ ప్రతిష్టాపనకు తాము వ్యతిరేకం కా దని, వినాయక చౌరస్తా మీదుగా ముస్లిం స్మశాన వా టికకు వెళ్లే మార్గం కావడంతో పాటు, ఈద్గాకు కూడా వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. వినా యక చవితి ఉత్సవాల్లో అక్కడ వినాయకుడి విగ్రహ ఏర్పాటుతో ఎవరైనా ముస్లిం సోదరులు చనిపోయిన సమయాల్లో అంత్యక్రియల కోసం స్మశాన వాటికకు తీసుకెళ్తున్నప్పుడు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. వినాయక చౌరస్తాలో విగ్రహ ప్రతిష్టాపన విషయం లో గతంలో కొడంగల్ ఉన్న సీఐలకు, ఎస్సైలకు మెమోరాండం అందించారన్నారు. పెద్దలతో మాట్లా డిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అంగీకారానికి ఒప్పుకున్నారని గుర్తుచేశారు. కార్యక్ర మంలో ఎంఏషాకీర్, ఎండీహమీద్, ఎండీ గౌస్, షేక్ రోమాన్, ఎండీబాబా, ఎండీ రసూల్ ఖాన్ తదితరు లు పాల్గొన్నారు.