నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) జి.వెంకటేశ్వర రెడ్డి ఆదివారం ఏరియాలోని కోయగూడెం ఉపరితలగనిలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఓసి పని స్థలాలను సందర్శించి అక్కడ జరుగుచున్న పనులను పరిశీలించారు. రోజు వారి బొగ్గు ఉత్పత్తి, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను జిఎం ఎం.షాలెం రాజును అడిగి తెలుసుకున్నారు. తరువాత డైరెక్టర్(పిపి) జి.వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి, రవాణా రోజు వారి లక్ష్యాలను అధిగమించాలని, అలాగే వేసవి కాలంలో ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా రక్షణతో కూడిన ఉత్పత్తి తీయాలని, సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జి.యం.ఎం.షాలెం రాజు, కేఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ యన్.వి.ఆర్ ప్రహలాద్, మేనేజర్ సౌరబ్ సుమన్, ప్రాజెక్ట్ ఇంజనీర్ శివ శంకర్, ఏరియా క్వాలిటీ అధికారి యూసఫ్, సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.