వీఐటీ-ఏపీ యూనివర్సిటీ డే వేడుకలు

హైదరాబాద్‌ : వీఐటీ-ఏపీ యూనివర్సిటీలో యూనివర్సిటీడే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోష్‌ గ్లోబల్‌ టెక్నాలజీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బోనం రాజ్‌ కుమార్‌, గౌరవ అతిథిగా వీఐటీ వ్యవస్థాపకులు, చాన్సలర్‌ డాక్టర్‌ విశ్వనాథన్‌ పాల్గొన్నారు. యూనివర్సిటీ వార్షిక రిపోర్టును రాజ్‌కుమార్‌ ఆవిష్కరించారు. తర్వాత మహాత్మా గాంధీ అకడమిక్‌ బ్లాక్‌లో మేకర్స్‌ స్పేస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ క్లినిక్‌లను ప్రారంభించారు. వీఐటీ-ఏపీ 2017లో ప్రారంభమైనప్పటి నుంచి దాని ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆయన అభినందనలు తెలిపారు. వీఐటీలోని నాలుగు క్యాంపస్‌లలో సుమారు 80 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని జి. విశ్వనాథన్‌ అన్నారు. అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామనీ, ఇందుకు విద్యార్థుల విజయమే నిదర్శనమన్నారు. యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ ఎస్‌.వి కోటారెడ్డి యూనివర్సి వార్షిక నివేదికను చదివి యూనివర్సిటీ ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో అవార్డులు గెలుచుకున్న విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిని సత్కరించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జగదీశ్‌ చంద్ర ముదిగంటి, డిప్యూటీ డైరెక్టర్‌ (విద్యార్థి సంక్షేమం) డాక్టర్‌ అనుపమ నంబూరు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.