ఒకేషనల్‌ సర్టిఫికెట్‌ కోర్సు ఫలితాలు విడుదల

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
షార్ట్‌టర్మ్‌ ఒకేషనల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఇంటర్‌ విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్‌ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం లక్ష్మారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్‌ఐవీఈ) ఆధ్వర్యంలో గతనెలలో ఈ పరీక్షలను నిర్వహించామని పేర్కొన్నారు. 1,322 మంది పరీక్షలకు హాజరుకాగా, 971 (84.24 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. 351 (15.76 శాతం) మంది ఫెయిలయ్యారని తెలిపారు. ఫలితాల కోసం sive.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.