అవ్వ చేతిగుర్తుకు ఓటేసి అశీర్వదించు 

 – ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న  శ్రీను బాబు
నవతెలంగాణ- మల్హర్ రావు: అవ్వ చేతిగుర్తుకు ఓటేసి మంథని ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీదర్ బాబు అత్యధిక మెజార్టీతో గెలువాలని ఆశీర్వధించు అంటూ శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు ఆరు గ్యారంటీల  ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళవారం మంథని ప్రజలతో మమేకమై  కాంగ్రెస్ పార్టీ  గ్యారంటీ పథకాలు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు విజయభేరి  భారి బహిరంగ సభలో శ్రీమతి సోనియా గాంధీ ప్రకటించిన అభయ హస్తం పథకాలలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం, కార్యక్రమాలతోపాటు ఆరు గ్యారెంటీ కార్డులను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి పేద ప్రజలకు ప్రతి ఒక్క పథకం అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.