వెయ్యర వోటు.. చెయ్యి గుర్తుకు ఓటు.?

– గడపగడపకు  కాంగ్రెస్ నాయకుల సంయుక్త ప్రచారం
– మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవతెలంగాణ- మల్హర్ రావు: వెయ్యర వోటు.. చెయ్యి గుర్తుకు ఓటు అంటూ మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో గడపగడపకు జోరుగా..హుషారుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న విశేష ఆదరణతో కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని, మంథని ఎమ్మెల్యేగా  తెలంగాణ కాంగ్రెస్ మేనిపేస్టో చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు భారీ మెజార్టీతో గెలువబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు ఆధ్వర్యంలో సంయుక్తంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటా సోనియాగాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో అవినీతి పెరిగిందన్నారు. త్యాగాలు చేయని కుటుంబానికి అధిక సంఖ్యలో పదవులు ఎందుకని, రాష్ట్ర ఏర్పాటులో అమరులైన కుటుంబానికి ఒక పదవీ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఐత రాజిరెడ్డి, మండల మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ, యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి, ఎస్సి సెల్ అధ్యక్షుడు మంథని రాజా సమ్మయ్య, సర్పంచ్ రాజు నాయక్, మేనం శ్రీనివాస్, రవి, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.