వ్యవసాయ మార్కెట్‌ తరలిపోకుండా కృషి చేసిన వ్యకి శ్రీకాంత్‌

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ – ఖమ్మం కార్పొరేషన్‌
ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో త్రీ టౌన్‌ ప్రాంతంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఖమ్మం అసెంబ్లీ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎర్రా శ్రీకాంత్‌తో కలిసి పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న ఈ వ్యవసాయ మార్కెట్‌ని కార్పోరేట్‌, రియల్‌ ఎస్టేట్‌, పెట్టుబడిదారుల అవసరాల కోసం ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని ప్రయత్నం చేస్తే దీనివలన ఈ మార్కెట్‌ మీద ఆధారపడి బతుకుతున్న కార్మికులు ఇబ్బందులకు గురవుతారన్నారు. ఈ ప్రాంతం,చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటాయని, దీనివల్ల వేల కుటుంబాలు రోడ్డు మీద పడతాయని, సిపిఎం ఆలోచించి పోరాటాల రూపకల్పన చేసి పోరాటాల ఉద్యమాలకు నాయకత్వం వహించిన వ్యక్తి యర్రా శ్రీకాంత్‌ అన్నారు. కావున మీరందరూ తప్పకుండా సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకి ఓటు వేసి యర్రా శ్రీకాంత్‌ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, సిపిఎం త్రీ టౌన్‌ కార్యదర్శి భూక్యా శ్రీనివాస్‌ రావు, సిపిఎం త్రీ టౌన్‌ కార్యదర్శి వర్గ సభ్యులు వజనేపల్లి శ్రీనివాసరావు, 31వ డివిజన్‌ కార్పొరేటర్‌ యర్రా గోపి, 35వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఏల్లంపల్లి వెంకట్రావు, బండారు యాకయ్య , పత్తిపాక నాగ సులోచన, బండారు వీరబాబు, ఎస్‌ కే సైదులు, శీలం వీరబాబు, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎర్ర రమేష్‌, సిపిఎం త్రీ టౌన్‌ నాయకుడు ఎస్కే బాబు, పోతురాజు, జార్జి , పగడాల మోహన్‌ రావు, వేల్పుల నాగేశ్వరరావు, మద్ది సత్యం, పాశం సత్యనారాయణ, కొట్టి అలివేలు, రంగు హనుమంతచారి, గబ్బెటి పుల్లయ్య, ఎస్కే మస్తాన్‌, యర్రా మల్లికార్జున, యర్రా నగేష్‌, యర్రా రంజిత్‌ ,యర్రా సాయి, యర్రా నాగరాజు, తదితరులు పాల్గొన్నారు..