ఆలయ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్..

నవతెలంగాణ – నవీపేట్: ఆలయం కూల్చివేశారని అధికార పార్టీ… ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని బీజేపీ నాయకులు పోలీసులకు పరస్పర ఫిర్యాదులు చేసుకొని నవీపేట్ మండలంలో బిఆర్ఎస్ బీజేపీల మధ్య వార్ ను కొనసాగిస్తున్నారు. మండలంలోని కోస్లీ శివారులో గల, ఎల్కే ఫారం గ్రామానికి సమీపంలోని వ్యవసాయ భూమిలో గల హనుమాన్ ఆలయ గోడలను కూల్చారని రాంపూర్ సర్పంచ్ భర్త దొంత ప్రవీణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ప్రాచీన ఆలయాన్ని బీజేపీ నాయకులు మువ్వ నాగేశ్వరరావు బీజేపీతో కూల్చి వేశారని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై రాజారెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ విషయమై బోధన్ నియోజకవర్గ బిజెపి నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి సైతం కార్యకర్తలతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. బీజేపీ నాయకులు ఆలయాన్ని కూల్చి హిందూ మనోభావాలను దెబ్బతీశారని బీఆర్ఎస్ నాయకులు, అధికార పార్టీ నాయకులు మతం ముసుగులో ఆలయ నిర్మాణాన్ని అడ్డుకొని రాజకీయాలు చేస్తున్నారని పరస్పర విమర్శలు చేసుకోవడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.