ప్రతి ఇంటి నుండి వ్యర్ధాల సేకరణ జరగాలి

– కలెక్టర్‌ ప్రియాంక అలా
నవతెలంగాణ-పాల్వంచ
ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి వ్యర్ధాల సేకరణ ప్రక్రియ జరగాలని కలెక్టర్‌ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. శనివారం పాల్వంచ పట్నంలోని అయ్యప్ప నగర్‌ శ్రీనివాస్‌ కాలనీలో పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. మురుగు కాలువలలో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించి, పరిశుభ్రం చేయాలని చెప్పారు. వ్యర్ధాలు పేరుకపోవడం వల్ల నీటి నిల్వలు ఏర్పడి దోమల వ్యాప్తి జరుగుతుందని ప్రతి రోజు కార్యక్రమాలు శానిటరీ ఇన్స్పెక్టర్లు పరిశీల చేయాలని, నివేదికలు అందజేయాలని ఆదేశించారు. మురుగునీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో దోమల వ్యాప్తి నిరోధానికి గంబుషియా చేపలు, ఆయిల్‌ బాల్స్‌ వేయాలని చెప్పారు. ఆరుబయట వ్యర్థాలు వేయకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజల ఇండ్ల నుండి వెలువడే వ్యర్థాలను మునిసిపల్‌ సిబ్బందికి అందజేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిశీలన పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. స్వచ్ఛ వాహనాలు అన్ని వార్డులకు వెళ్తున్నాయా లేదా పరిశీలించాలని, నిరంతరం పర్యవేక్షణ చేయాలని అన్నారు. అపరిశుభ్రత కనిపిస్తే చర్యలు తప్పవని మున్సిపల్‌ సిబ్బందికి హెచ్చరించారు. ఆయా కాలనీలా ప్రజలను పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. పాత పాల్వంచ జడ్పీ హైస్కూల్‌ మండల ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాల ప్రత్యేక హౌదా కార్యక్రమం కూడా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్‌ నమోదు మార్పులు చేర్పులు తొలగింపులుకు ప్రత్యేక కేంద్రాలు జరుగుతాయని, ఓటర్లు ఇట్టి ప్రత్యేక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జనవరి 1, 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం నమోదు కావాలని చెప్పారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బూతు స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని ఓటర్‌ నమోదుకు మార్పులు చేర్పులకు అలాగే తొలగింపు అవసరమైన 6,7,8 ఫారాలను అందజేయాలని సూచించారు. శనివారం 1095 పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఫారం 6కు 519 ఫారం 7కు 155, ఫారం 8కు 223, మొత్తం 897 దరఖాస్తు వచ్చినట్లు ఆమె తెలిపారు. వచ్చిన ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో శిరీష, పాల్వంచ మున్సిపల్‌ కమిషనర్‌ స్వామి, తహసీల్దార్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.