వృథాగా పోతున్న నీరు

– నిలిచిపోయిన ట్రాఫిక్‌ జామ్‌
– పట్టించుకోని జలమండలి అధికారులు
నవతెలంగాణ-గండిపేట్‌
నార్సింగిలోని 6వ వార్డులోని కొత్తగా వేసిన సీసీ రోడ్డు తొవ్వి పెద్ద పైపులైన్‌ కోసం జేసీబీతో తొవ్వడంతో చిన్న పైపులైన్‌ పగిలిపోయింది. దీంతో కాంట్రాక్టర్‌, జలమండలి అధికారులు నిర్లక్ష్యంతో మంచినీళ్లు పూర్తిగా రోడ్డుపై నీళ్లు వృథాగా పోతున్నాయి. రోడ్డు మరమ్మతు పనుల్లో భాగంగా ఒక భాగమే వాహనదారి ఉండటంతో, ఇప్పుడు పైపులైన్‌ ఇబ్బందులతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దాదాపు మూడు గంటలపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే సమయంలో స్కూల్‌, కాలేజీలకు వేళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే విషయంపై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. పనులు రాత్రి సమయాల్లో చేపట్టాలని చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. దీంతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పనుల్లో వేగం పెంచాలని కోరారు. దీంతో పాటు పైపులైన్‌ను సరిచేయాలని కోరారు.