హరిత తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం

మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బాతుక లావణ్య దేవేందర్‌ యాదవ్‌
సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు సంతోష్‌ నాయక్‌
నవతెలంగాణ-కొత్తూరు
హరిత తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని కొత్తూరు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బాతుక లావణ్య దేవేందర్‌ యాదవ్‌, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు సంతోష్‌ నాయక్‌ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం మండలంలోని వివిధ గ్రామాలలో తెలంగాణ హరితోత్సవదినాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలలో ఆయా సర్పంచులు గ్రామపంచాయతీ ఆవరణ, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామం లోని రోడ్డులకు ఇరువైపులా భారీగా మొక్కలు నాటించారు. మండలంలోని కొడిచెర్ల తండాలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు సంతోష్‌ నాయక్‌ తమ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. పెంజర్ల సర్పంచ్‌ మామిడి వసుంధరమ్మ స్థానిక వెంచర్‌ లోని 10శాతం ల్యాండ్‌ లో 500 మొక్కలను నాటించారు. మల్లాపూర్‌ సర్పంచ్‌ చిర్ర సాయిలు, గూడూరు సర్పంచ్‌ సత్తయ్య, మక్తగూడ సర్పంచ్‌ కాట్నా రాజు, తీగపూర్‌ సర్పంచ్‌ మైసగళ్ల రమాదేవి రమేష్‌ గ్రామంలోని రోడ్ల ఇరువైపుగా భారీగా మొక్కలు నాటారు. ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు రవీందర్‌ రెడ్డి కోడిచెర్ల అంగన్వాడి కేంద్రంలో మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శరత్‌ చంద్రబాబు, పంచాయతీరాజ్‌ ఏఈ హేమంత్‌, పంచాయతీ సెక్రెటరీ సురేందర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ డోలి రవీందర్‌, కౌన్సిలర్‌ కోస్గి శ్రీనివాస్‌, బ్యాగరి ప్రసన్నలత యాదయ్య, నాయకులు కమ్మరి జనార్దన్‌ చారి, దన్నాడ జంగయ్య యాదవ్‌, తీగాపూర్‌ కార్యదర్శి రవణీల తదితరులు పాల్గొన్నారు.

Spread the love