పట్ట భూమిలో అక్రమంగా ప్రవేశించిన వారిపై చర్యలు తీసుకోవాలి

మాజీ ఎంపీటీసీ లచ్చయ్య
నవతెలంగాణ-శంకర్‌పల్లి
తన పట్టా భూమిలో అక్రమంగా ప్రవేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని సింగపూర్‌ గ్రామ మాజీ ఎంపీటీసీ లచ్చయ్య వాపోయాడు. సోమవారం ఆయన శంకర్‌ పల్లి లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సింగ పూర్‌ గ్రామ పరిధిలోని 385 సర్వే నంబర్‌లో 12 గంటల భూమిని శంకర్పల్లికి చెందిన కాశెట్టి పెంటయ్య దగ్గర కొనుగోలు చేసినట్టు తెలిపారు. తమ వద్ద ధరణి పట్టా పాస్‌ పుస్తకాలు అన్ని రకాల ఒరిజినల్‌ ఉన్నా యన్నారు. అదే గ్రామానికి చెందిన ఎర్రోళ్‌ బుచ్చయ్య, శాంతయ్య, ఇద్దరు కలిసి అక్రమంగా తమ భూమిలోకి ప్రవేశించి, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయాడు. తమను భయభ్రాంతులను గురి చేస్తున్నారని శంకరపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్టు వెల్లడించారు. అయినా పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నాడు. 9వ వార్డు కౌన్సిలర్‌ ఎమ్మెల్యే చెరువుతో పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

Spread the love