– మట్టాకు తుమ్మల, సంభాని, పొంగులేటి వర్గీయుల భరోసా
నవతెలంగాణ-వేంసూరు
మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని, మాలో వర్గ విభేదాలు లేవని స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం మర్లపాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తుమ్మల, సంభాని, పొంగులేటి, మట్టా వర్గాల నాయకులు సమావేశమై శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు సమిష్టిగా కృషి చేస్తామని. తెలిపారు చిన్నచిన్న మనస్పర్థలు ఉన్నా పక్కనపెట్టి ప్రచారం నిర్వహిస్తామని వేంసూరు మండలం నుండి కాంగ్రెస్ అభ్యర్థి మట్ట రాగమయికి అత్యధిక మెజార్టీ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సీనియర్ నాయకులు బండి గురునాథరెడ్డి ఆధ్వర్యంలో కందుకూరులో నేటి నుండి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ముందుగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్, బండి గురునాథరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కాసర చంద్రశేఖర్ రెడ్డి, వెల్ది జగన్ మోహన్ రావు, అట్లూరి సత్యనారాయణరెడ్డి, రాచూరి గంగరాజు, గన్నేనీ సురేష్, మామిళ్ళపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పసుమర్తి వర్గం
నవతెలంగాణ- కల్లూరు
బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన వర్గం కార్యకర్తలతో కాంగ్రెస్‌లో పార్టీలో చేరుతున్నట్లు సీనియర్ నాయకులు పసుమర్తి చందర్రావు తెలిపారు. బుధవారం వీరాంజనేయ బ్రిక్స్ ప్లాంట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పలు కుటుంబాలు బిఆర్‌ఎస్, తెలుగుదేశంకు చెందిన వారు కాంగ్రెస్లోకి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్లో వర్గ విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని, కుటుంబంలో అన్నదమ్ముల తగాదా లాంటిదే ఈ విభేదాలని, సమయం వస్తే మేమంతా ఒకటేనని, ఏకతాటిపైకి వచ్చి పార్టీ గెలుపు కోసం పని చేస్తామని అన్నారు. తమ అభిమాన నాయకులు తుమ్మల నాగేశ్వరరావు పిలుపుమేరకు తెలుగుదేశం, బిఆర్‌ఎస్‌లో చేరామని తెలిపారు. ప్రస్తుత రాజకీయాల పరిస్థితుల దృష్ట్యా తుమ్మలతో పాటు సొంతగూటికి వచ్చామని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మట్టా రాగమయిని గెలిపించుకోవలసిన అవసరం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిని చూసి కాదని, హస్తం గుర్తుని చూసి ఓటెయ్యాలని సూచించారు .రాష్ట్ర స్థాయి నాయకులు తుమ్మల, పొంగులేటి పిలుపుమేరకు జిల్లాలో పదికి పది సీట్లు సాధించేలా కృషి చేయాలని అన్నారు.
డాక్టర్ మట్టా ఆధ్వర్యంలో ‘రేవంత్‌రెడ్డి’ : జన్మదిన వేడుకలు
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ క్యాంపు కార్యాలయంలో బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. కేక్ కట్‌చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు.
కల్లూరు: పట్నంలోని సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రరావు నివాసంలో టీపీసీసీ అధ్యక్షులు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఎనుముల రేవంత్‌రెడ్డి జన్మదిన సందర్భంగా బుధవారం జిల్లా కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్, పట్టణ సీనియర్ నాయకులు పసుమర్తి చందర్రావు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు భూక్య శివకుమార్, నువ్వు సత్యం బాబు, కార్యకర్తలు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.