గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంటాం

– తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే..
– ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి సమక్షంలో , బీజేపీ కిషన్‌ మోర్చా అధ్యక్షుడు మేగనాథ్‌ పవర్‌ బీఆర్‌ఎస్‌లో చేరికలు
నవతెలంగాణ-పెద్దేముల్‌
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివద్ధికి కట్టుబడి ఉంటుందని తాండూర్‌ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ కార్యాలయంలో పెద్దేముల్‌ మండల పరిధిలోని దారున్‌ వాగుతండాకు చెందిన బీజేపీ కిషన్‌ మోర్చా మండల అధ్యక్షుడు మేగనాత్‌ పవర్‌కు బీఆర్‌ఎస్‌ కండువా కప్పి, సాదారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతోందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.50 లక్షలు ప్రత్యేక నిధులు కేటాయిం చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండలా ధ్యక్షులు కోహిర్‌ శ్రీనివాస్‌, పెద్దముల్‌ గ్రామ కమిటీ అధ్యక్షులు డీవై ప్రసాద్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.