రక్తదానంతో ప్రాణదాతలమవుతామం

– అడిషనల్‌ డీసీపీ ప్రసాద్‌ రావు
నవతెలంగాణ-ఖమ్మం
రక్తదానంతో ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలు అవుతామని అడిషనల్‌ డీసీపీ, లా అండ్‌ ఆర్డర్‌ ప్రసాద్‌రావు అన్నారు. పోలీస్‌ ఫ్లాగ్‌ డే సందర్భంగా గురువారం పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లోని పోలీస్‌ శిక్షణ కేంద్రంలో రక్తదాన శిభిరం కార్యాక్రమం నిర్వహించారు. తొలుత అడిషనల్‌ డీసీపీ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలో పోలీస్‌ శాఖ చాలా కీలకమైన శాఖ అని, విధి నిర్వాహణలో ఎంతో మంది పోలీసులు ప్రాణాలు అర్పించారన్నారు. వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉండి వెన్నంటి ఉండేవిధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. రక్తదానం ఇవ్వడానికి వాలంటరీగా వచ్చిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ఆటో డ్రైవర్ల అందరికీ అభినందనలు తెలిపారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్‌ వ్యాస రచన పోటీలు, ఆన్‌లైన్‌ ఒపెన్‌ హౌజ్‌, ర్యాలీలు, అమరవీరుల కుటుంబాల సభ్యుల సమస్యలు, సందేహాలు తెలుసుకోవడం మొదలగునవి నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు హరికృష్ణ, ప్రసన్న కుమార్‌, సారంగపాణి, కృపాకర్‌, నర్సయ్య, సిఐలు స్వామి, కుమారస్వామి, అశోక్‌, సర్వయ్య, ఆర్‌ ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్‌ , డాక్టర్‌ జితేంధర్‌, సంకల్పం తాలసేమియా స్వచ్ఛంద సంస్థ,ఆటో యునియన్‌ నాయకులు పాల్వంచ కృష్ణ పాల్గొన్నారు.