– పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి టీ.దయాకర్‌రెడ్డి
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
మన సంస్కృతీ, సాంప్రదాయాలను కాపాడాలని పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు తయాకర్‌రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం రూరల్ మండలం పెద్దతండ గ్రామ పంచాయతీ సాయి ప్రభాత్ నగర్-2 కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో చిన్నారులు, మహిళలతో పాటు వద్దులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్యాంపు కార్యాలయ ఇంచార్జి టీ. దయాకర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. మహిళలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మన సంస్కతీ సంప్రదాయాలను కాపా డాలని కోరారు. మహిళలు చైతన్య అయినప్పుడే సమాజం బాగుం టుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి మహిళలను ప్రోత్సహిస్తున్న కాలనీ కమిటీ సభ్యులను అభినందించారు. ఇక్కడి ప్రజలందరూ ఎప్పుడూ ఇదే స్పూర్తితో ఐకమత్యంగా ఉండాలని కోరారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీలో పాల్గొన్న వారికి ప్రథమ, ద్వితియ, తతియ బహుమతులతో పాటు 40 మందికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా ప్రొఫెసర్లు ఎన్.అనితా చౌదరి, గాజుల భారతి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి పిఏ. రాఘవరావు, కాలనీ వాసులు దుస్సా జగదీశ్, తూముల వెంకట్రావు, చల్లా రామారావు, సిద్ధంశెట్టి వెంకటేశ్వర్లు, వల్లేబోయిన వెంకట రమణ, అమెరికన్ టౌన్ షిప్ ప్రొప్రైటర్స్ మైబెల్లి సాహెబ్, లాలు సాహెబ్, బానోత్ కిషోర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.