అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం

– కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
అమర వీరుల కుటుంబాలకు అండగా ఉండి ఆదుకుంటామని కూకట్‌ పల్లి ఎమ్మెల్యే మాధవరం కౄష్ణారావు అన్నారు. గురువారం అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని బాలాజీనగర్‌ డివిజన్‌ ఆంజనేయనగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి, మలిదశ ఉద్యమంలో అమరుడైన అమరవీరుడు రాజారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కే.పి.హెచ్‌.బి కాలనీ అమరవీరుడు రాజారెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్‌ పగుడాల బాబూరావు , డీసీ రవికుమార్‌, కోఆర్డినేటర్‌ సతీష్‌ అరోరా, మెడికల్‌ ఆఫీసర్‌ సోలోమన్‌, డివిజన్‌ అధ్యక్షులు సిహెచ్‌ ప్రభాకర్‌ గౌడ్‌ లు పరామర్శించారు. అనంతరం 2012 మిలియన్‌ మార్చ్‌లో మరణించిన రాజారెడ్డి త్యాగం మరువలేనిదన్నారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రధాత అని ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్మరణలో వారికి అశ్రునివాళ్లులర్పించారు. ఈ సందర్భంగా రాజా రెడ్డి భార్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కల్పించారన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలాంటి కష్టం వచ్చినా రాజారెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు దేవాది హరినాథ్‌, ధర్మారావు, భూమండ్ల అశోక్‌, ఈదులకంటి అశోక్‌, శ్రీకాంత్‌, వెంకట్‌, చెరుకు సత్యనారాయణ గౌడ్‌, కిష్టయ్య, విష్ణు, యు.కృష్ణా, చిరంజీవి, యాదగిరి, శారద తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్‌లో ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం
మేడ్చల్‌ : రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం మేడ్చల్‌ మండల పరిధిలో అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ వీర్లపల్లి రజితరాజ మల్లారెడ్డి ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శైలజ విజయా నందా రెడ్డి, ఎంపీడీవో పద్మావతి, వైస్‌ ఎంపీపీ గోపని వెంకటేష్‌, ఎంపీటీసీలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మేడ్చల్‌ మున్సిపల్‌ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ సభ చైర్‌ పర్సన్‌ మర్రి దీపికా నర్సింహ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమరవీరులకు రెండు నిమిషాల మౌనం పాటించి మున్సిపల్‌ కార్మికులకు మల్లారెడ్డి హెల్త్‌ సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌ పర్సన్‌ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన అమరవీరుల సంస్మరణ సభ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి ఉద్యమ కారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మెన్‌ ప్రభాకర్‌, కమిషనర్‌ రాములు,కౌన్సిలర్లు పాల్గొన్నారు. మండల పరిధిలోని నూతన్‌ కల్‌ గ్రామంలో సర్పంచ్‌ కవిత జీవన ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి విద్యా ర్థులకు బహుమ తులు అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మెన్‌ సద్ది సురేష్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ ప్రభాకర్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు. డబిల్‌ పూర్‌ గ్రామంలో సర్పంచ్‌ గీతా భాగ్యరెడ్డి ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పి ంచారు. అనంతరం సర్పంచ్‌ మాట్లా డుతూ అమరుల త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిం దన్నారు. ఉపసర్పంచ్‌ సత్యనారా యణ, వార్డు సభ్యులు, నాయ కులు భాగ్య రెడ్డి, బీఆర్‌ఎస్‌ గ్రామ అధ్య క్షుడు శ్రీరామ్‌రెడ్డిలు పాల్గొన్నారు