పేద విద్యార్థులకు చేయూతనందించాలి

– లయన్‌ ఎస్‌. నరేందర్‌ రెడ్డి
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు చేయూతనందించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముం దుకు రావాలని లయన్స్‌ క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ (ఎల్‌సీఐఎఫ్‌) ఏరియా లీడర్‌ లయన్‌ ఎస్‌. నరేందర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌ సెలబ్రిటీస్‌ అధ్యక్షులు ఏ.విటల్‌ రావు పాటిల్‌ అధ్యక్షతన కుత్బుల్లాపూర్‌ నియోజక వర్గం గాజులరామారం సర్కిల్‌ పరిధి ,జగద్గిరిగుట్ట డివిజన్‌లోని జగద్గిరి నగర్‌ ప్రాథమిక పాఠశాలలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌ సెలబ్రిటీస్‌, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌ నలంద, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌ పేరెల్స్‌, ప్రతినిధుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లయన్స్‌ ప్రతినిధులు కౌన్సిల్‌ చైర్‌ పర్సన్‌ లయన్‌ ఎం .విద్యాసాగర్‌ రెడ్డి, డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ లయన్‌ కమల్‌ కిషోర్‌ అగర్వాల్‌, ఫస్ట్‌ వైస్‌ డిిస్టిక్‌ గవర్నర్‌ లయన్‌ టి. రాజేంద్రప్రసాద్‌, సెకండ్‌ వైస్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ (ఎల్‌సీఐఎఫ్‌) కోఆర్డినేటర్‌ లయన్‌ ఎస్‌.సాయిరామ్‌ రాజు, డిస్ట్రిక్ట్‌ క్యాబినెట్‌ సెక్రెటరీ లయన్‌ దినేష్‌ కె గిల్డ, , ప్రాజెక్ట్‌ చైర్‌ పర్సన్‌ లయన్‌ శ్రీనివాస్‌ సాలికే ,లయన్‌ సురభి దుర్గా వాణితో కలిసి 75 బెంచీలను పాఠశాల ప్రధానోపాధ్యా యులు శివకుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యానభ్య సించిన వారే నేడు ఉన్నత హౌదాలో ఉన్నారని వారిని స్ఫూర్తిగా తీసుకుని బాగా చదివి పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కు తమ లయన్స్‌ క్లబ్‌ ద్వారా సేవలందించాలనే లక్ష్యంతో గత కొన్నేండ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు విస్తతం చేస్తామని తెలిపారు. లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు లయన్‌ యస్‌. రవీందర్‌ రావు, లయన్‌ కొలన్‌ హనుమంత్‌ రెడ్డి. శ్రీనివాస్‌ గార్గే లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌ సెల బ్రిటీస్‌ కార్యదర్శి సతీష్‌ కుమార్‌ బిరాదర్‌, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ నలంద కార్యదర్శి వివేకానంద్‌ జా, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సికిం ద్రాబాద్‌ పేరల్స్‌ అధ్యక్షులు సందీప్‌ షా, తోపాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Spread the love