– కార్మిక ప్రజాసంఘాల నాయకులు అరుణ్ కుమార్
నవతెలంగాణ- వీర్నపల్లి
కార్మికుల పక్షాన నిలబడిన వారికే మా కార్మికుల ఓట్లు వేస్తామని కార్మిక ప్రజా సంఘాల నాయకులు అరుణ్ కుమార్ అన్నారు.వీర్నపల్లి మండల కేంద్రంలో కార్మిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి జాల పల్లి మనోజ్ కుమార్ నిర్వహించడం జరిగింది. ఇటీవలే అనారోగ్యంతో చనిపోయిన కార్మికులకు మొదటగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి నివాళులు అర్పించారు. ముఖ్యఅతిథిగా సిఐటియూ జిల్లా అధ్యక్షుడు ఎగుమంటి ఎల్లారెడ్డి హాజరైనారు కార్మిక ప్రజాసంఘాల ప్రతినిధి మల్లారపు అరుణ్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కార్మికుల బ్రతుకులు మారడం లేదని అన్నారు, రెక్క కాడితే కానీ డొక్కాడని కార్మికుల జీవితల్లో వెలుగులో నింపే వారే కరువయ్యారని అన్నారు కార్మికుల సమస్యలు పరిష్కరించిన వారికే మా కార్మికుల ఓట్లు వేస్తామని అన్నారు. రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి జరిగేలా మేనిఫెస్టోలో పెడితేనే కార్మికుల అండ ఉంటుందని అన్నారు. కార్మికులకు సమానపనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని అన్నారు, హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు, గ్రామపంచాయతీ కార్మికులకు గౌరవ వేతనాన్ని పెంచి,పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని అన్నారు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు, మండలంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన గిరిజనేతర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల పేదలకు పోడు పట్టాలి ఇవ్వాలని అన్నారు. పోడు భూముల కోసం పోరాడిన ప్రజాసంఘాల నాయకులపై పోడు రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని అన్నారు. వీర్నపల్లి వెంకట్ రాయిని చెరువులో భూములు కోల్పోయిన 80కుటుంబాల భూ నిర్వాసితులకు దళిత భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలంలో వేలాది మంది కార్మికులు కార్మిక సంఘాలు ఉన్నప్పటికీ కార్మిక భవనం లేకపోవడంతో ప్రతి నెల చెట్ల కింద సమావేశాలు జరుపుకుంటు ఇబ్బందులు పడుతున్నామని మండల కేంద్రంలో కార్మిక భవనం నిర్మాణం చేయాలని కోరారు. పై సమస్యల పరిష్కారాలు పరిష్కారానికి అండగా నిలబడిన వారికే కార్మికుల మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజయ్య హమాలి సంఘం మండల అధ్యక్షుడు అన్నారం రాజేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు దేవయ్య, గ్రామపంచాయతీ కార్మిక సంఘం అధ్యక్షుడు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.