చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

– జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్
– జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ – చేర్యాల
చేర్యాల, మద్దూరు, కొమురవెళ్లి, దూలిమిట్ట మండలాలతో కూడిన చేర్యాల ను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని వాసవి గార్డెన్ లో మంగళవారం జేఏసీ సమావేశం నిర్వహించారు. అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల పట్టణ,రురల్,మద్దూరు,దూలిమిట్ట మండలాల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చేర్యాల పట్టణ కన్వీనర్ గా తాడెం ప్రశాంత్, చేర్యాల రూరల్ కమిటీ కన్వీనర్ గా బొమ్మగోని అంజయ్య, మద్దూరు మండల కన్వీనర్ గా ఎండీ. తాజ్ మహ్మద్,దూలిమిట్ట మండల కన్వీనర్ గా బండి చంద్రం, యూత్ కన్వీనర్ గా బిజ్జ రాము ను ఎన్నుకున్నట్లు పరమేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పది రోజుల్లో గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేసి, తెలంగాణ ఉద్యమ స్పూర్తితో సకల జనుల సమ్మె పోరాటం తరహాలో రెవెన్యూ డివిజన్ సాధనకై పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ వైస్ చైర్మన్ పుర్మ ఆగంరెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, గురువయ్య గౌడ్, ఆలేటి యాదగిరి, తాడెం వెంకటస్వామి, పోతుగంటి ప్రసాద్, గద్దల మహేందర్, మిట్టపల్లి నారాయణరెడ్డి, బండి సుదర్శన్, శెట్టిపల్లి సత్తిరెడ్డి, మండలాల అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.