టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్
కడ్తాల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ, సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం
నవతెలంగాణ-ఆమనగల్
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ రుణాన్ని తీర్చుకుంటామని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కడ్తాల్ మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు బిచ్యా నాయక్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన తెలంగాణ తల్లి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై బాణసంచా కాల్చుతూ కాంగ్రెస్ పార్టీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ డీసీసీ అధికార ప్రతినిధి, జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ ముదిరాజ్, మండల పార్టీ అధ్యక్షుడు బిచ్యా నాయక్ తదితరులతో కలిసి మాట్లాడారు. ఎన్నో త్యాగాలు, మరెంతో మంది తెలంగాణ అమరవీరుల ప్రాణ త్యాగాలు ప్రతిఫలంగా, సోనియా గాంధీ సాహసోపేతమైన నిర్ణయంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం చేజిక్కించుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని అన్నారు. అదేవిధంగా ఏఐసీసీ ప్రధాన నాయకులు రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర వీరులకు నివాళులు అర్పిస్తూ, ఉద్యమ వీరులను గుర్తు చేసుకుంటూ యావత్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్, మండల అధ్యక్షుడు కేతావత్ హీరాసింగ్ నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ చేగురి వెంకటేష్, కోఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, సక్రు, సర్పంచులు శంకర్, బావోజీ, రాము, సీనియర్ నాయకులు జవాహర్ లాల్, నాయకులు బ్రహ్మచారి, లక్ష్మయ్య, రామకృష్ణ, శేఖర్, మల్లయ్య, యాదయ్య, బాలరాజు, మల్లేష్ గౌడ్, ఎఖ్బాల్ పాషా, యాదయ్య, అజ్గర్ అలీ, శీను, మధు, తిరుపతిరెడ్డి, జంగయ్య, షాబుద్దీన్, భాను కిరణ్, క్యామ రాజేష్, ఇమ్రాన్ బాబా, శ్రీకాంత్ రాజేందర్ గౌడ్, విజరు నాయక్, ప్రవీణ్ గౌడ్, వంశీ, భరత్ యాదవ్, తులసిరామ్, శివ, రమేష్,రాజు, అంజి, వెంకటేష్, బాలకృష్ణ, సేవ్యా పాల్గొన్నారు.