ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం

– వట్టినాగులపల్లి 2వ వార్డులో పర్యటన
– నార్సింగ్‌ చైర్‌ పర్సన్‌ రేఖ యాదగిరి
నవతెలంగాణ-గండిపేట్‌
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిత్యం కుర్చీ చేస్తున్నట్లు నార్సింగ్‌ చైర్‌ పర్సన్‌ రేఖ యాదగిరి అన్నారు. ఆదివారం నార్సింగ్‌ మున్సిపాలిటీలోని వట్టినాగులపల్లి రెండో వార్డులో అధికారపక్ష నాయకులతో కలిసి పర్యటిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వార్డు ను ఆదర్శంగా చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక రాజకీయం చేస్తున్నట్లు ఆరోపించారు. తమ వార్డును నా ర్సింగ్‌ మున్సిపాలిటీలోనే ఆదర్శంగా చేస్తున్నట్లు అన్నారు ఇలాంటి సమస్యలు లేకుండా 100 శాతం సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ వార్డు అధ్యక్షులు పర్వేద రాజు మాట్లాడుతూ.. చైర్‌ పర్సన్‌ వార్డులో ఏమీ చేయట్లేదని కాంగ్రెస్‌ నాయకులు రాజకీయం చేయడం సరి కాదన్నారు. మున్సిపల్‌ చెత్త బండి మరమ్మతులు కార ణంగా వార్డులో తిరగడం లేదన్నారు అంతమాత్రాన రాజకీ యం చేయడం సరికాదన్నారు. చైర్‌పర్సన్‌ ఆధ్వర్యంలో పట్నాలపల్లి రెండో వార్డును అన్ని సమస్యలూ పరిష్కరిం చుకున్నట్లు తెలిపారు. పర్సన్‌పై అనవసరంగా దృశ్య ప్రచా రం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్ర మంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మర్పల్లి వేణుగోపాల్‌ రెడ్డి, బక్కని సాయి పటినాలపల్లి శానిటేషన్‌ సూపర్వైజర్‌ రంజాన్‌ పాషా మున్సిపాల్‌ సిబ్బంది, నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.