– హైకోర్టు నుంచి నోటీసులు
– పంపడం దారుణం
– రైతుల మనోభావాలు పట్టించుకోని వైనం
– మొండిగా వ్యవహరిస్తున్న క్రషర్ యజమాని
– ఎట్టి పరిస్థితుల్లోనూ క్రషర్‌ను పెట్టనివ్వబోం : మొండి గౌరెల్లి రైతులు
నవతెలంగాణ-యాచారం
ప్రాణం పోయినా సరే క్రషర్ మిషన్‌ను పెట్టకుండా అడ్డుకుని తీరుతామని మొండి గౌరెల్లి రైతులు తాండ్ర రవీందర్, మర్రిపల్లి సోమశేఖర్, ఎలిమినేటి శ్రీనివాసరెడ్డి, నక్క యాదగిరి, గుర్రం చెన్నారెడ్డి, గుడాల వెంకటేష్ హెచ్చరించారు. శుక్రవారం మొండి గౌరెల్లి రైతులకు హైకోర్టు నుంచి క్రషర్ యజమాని నోటీసులు పంపడాన్ని వారు తప్పు పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల, గ్రామ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ప్రభుత్వం క్రషర్ మిషన్‌ను ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఏదేమైనా సరే మొండి గౌరెల్లిలో క్రషర్‌ను ఏర్పాటు చేయకుండా జైళ్లకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. క్రషర్ ఏర్పాటు చేయకుండా న్యాయ సలహాలు తీసుకుని తాము ముందుకెళ్తామని తెలిపారు. క్రషర్ యజమాని అడ్డుకుంటున్న రైతులపై కక్షపూరితంగా కోర్టు ద్వారా నోటీసులు పంపడం ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద మొండి గౌరెల్లి రైతులకు అన్యాయం చేయాలని కొందరు క్షకట్టుకుని పనిచేస్తున్నారని విమర్శించారు. క్రషర్ మిషన్ యజ మానికి పరోక్షంగా సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎద్దేవా చేశారు. కొంత మంది ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండి గౌరెల్లిలో క్రషర్ మిషన్ ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.