– కనకయ్యకు కేటాయించినందుకు ధన్యవాదాలు
– రాష్ట్ర ప్రచార కమిటీ కో-చైర్మెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-ఇల్లందు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సోనియా, రాహుల్ గాంధీలు ప్రకటించినట్టు 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రచార కమిటీ కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని రాగబోయిన గూడెం వద్దగల వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ వద్ద మంగళవారం మండల అధ్యక్షుడు పులి సైదులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్, ఎన్డీ పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆపార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో-చైర్మన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్మినారాయణలు పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్, ఎన్డీ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన అందరికీ మనుసుపూర్తిగా స్వాగతం పలుకుతున్నామన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తే హరిప్రియ, హరిసింగ్‌లు ఇద్దరూ ఎమ్మెల్యేలు ఉంటారని, అదే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కోరం కనకయ్య ఒక్కేడే ఎమ్మెల్యేగా ఉంటాడని అన్నారు. ఇల్లందు అసెంబ్లీ టికెట్ కనకయ్యకు కేటాయించినందుకు ఏఐసీసీ పెద్దలకు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రజా ప్రతినిధులు వీరే
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు ధనియాలపాడు సర్పంచ్ నునవాత్ తిరుపతి, (బీఆర్‌ఎస్‌పార్టీ), రాగబోయిన గూడెం సర్పంచ్ కునుసోత్ జానకి, ఆమె కుమారుడు మాజీ సర్పంచ్ కునుసోత్ రాము, న్యూ డెమోక్రసీ పార్టీ, నలుగురు వార్డు సభ్యులు బొల్లి నర్సమ్మ, నారాయణ పురం, 1వ వార్డ్, జోగా కృష్ణ నారాయణ పురం, బీఆర్‌ఎస్ పార్టీ, 2వ వార్డ్, మోగిలి నరేష్ కొత్తగుంపు, న్యూ డెమోక్రసీ పార్టీ, జెజ్జాల లక్మి, 5 వార్డ్, పార్టీ వారితో పాటుగా 500 మందికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.