– కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ ఎవరికి కేటాయించిన వారికి సంపూర్ణ మద్దతు
– ఈ నియోజకవర్గం కాంగ్రెస్ అడ్డా…
– విలేకర్ల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల స్పష్టం
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం నియోజకవర్గంలో ఎటువంటి వర్గవిభేదలు లేవని, అందరం కలిసికట్టుగా అభ్యర్థి గెలుపే దిశగా పని చేస్తామని, రాష్ట్ర టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు, రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దేవి ప్రసన్న, రాయల శాంతయ్య, తూము చౌదరి, ఆళ్ల మురళి, నాగేంద్ర త్రివేది స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక సూర్యప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం మాటకు కట్టుబడి అందరం కష్టపడి పనిచేస్తామన్నారు. కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ ఎవరికి కేటాయించినప్పటికీ వారి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. గత 30 సంవత్సరాలుగా కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ అడ్డా అని, ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తు వస్తున్న విషయాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కొత్తగూడెం టికెట్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికీ కేటాయించిన వారికి సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. నియోజకవర్గంలో వర్గావిభేదాలు పక్కనబెట్టి అధిష్టానం నిర్ణయం మేరకు అందరం కలిసి పార్టీ అభ్యర్థిని గెలిపించిన ధ్యేయంగా పనిచేస్తామని ఉద్ఘాటించారు. గడప గడపకు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక పాలన విధానాలను ప్రజలలోకి తీసుకెళ్లి వివరించి ప్రజలను చైతన్య చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని, కెసిఆర్ పాలన వల్ల ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ప్రజలు పడరని పాట్లు పడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రజాసంక్షేమ పథకాల గురించి ప్రజలకు క్లుప్తంగా తెలియజేస్తున్నామ న్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలలో గెలిపించి సోనియా గాంధీకి బహుమతిగా సమర్పించాలని, రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పని చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, పాల్ అంతోని, సకినాల వెంకన్న, వెంకన్న, జరీనా, ఎండి. ఖలీల్, దుగ్గిరాశి సతీష్, ఆయూబ్, గౌస్, రాము, పండు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నియమావళి పాటించాలి
నవతెలంగాణ-పినపాక
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అందరూ ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని తహసీల్దార్ వీరభద్రప్రసాద్ అన్నారు. శుక్రవారం వారి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేట్, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లను తొలగించామని, అన్ని రాజకీయ పార్టీలు ర్యాలీలు సమావేశాలు నిర్వహించడానికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.